రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రస్టుపట్టించిదని ఆయన ఆరోపించారు. మీడియాపై తప్పుడు కేసులు పెడుతున్నారని బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారని, డీజీపీ ఇప్పటికే రెండుసార్లు కోర్టుకు హాజరుకావడమే దీనికి నిదర్శనమన్నారు. అచ్చెన్నాయుడికి రెండవసారి ఆపరేషన్ కావడానికి పోలీసులే కారణమని ఆయన ఆరోపించారు.