36 గంటల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేత..

Update: 2020-06-19 18:11 GMT

సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఈ నెల 21న సూర్యగ్రహణం కాగా ముందు రోజు 20వ తేదీ రాత్రే శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి 21వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు సంప్రోక్షణ అనంతరం శ్రీవారి ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. పుణ్యావచనం, శుద్ధి, కైంకర్యాలు, నివేదనలను అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారు. తదుపరి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రాత్రి 8.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి 22వ తేదీ ఉదయం తెరుస్తారు. అప్పుడు భక్తులకు స్వామి వారి దర్శనం లభిస్తుంది.

Similar News