అమెజాన్ కి గ్రీన్ సిగ్నల్.. ఆల్కహాల్ హోం డెలివరీ..

Update: 2020-06-20 13:15 GMT

కరోనా వైరస్ లాక్డౌన్ ప్రభావంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది. పుంజుకోవాలంటే మద్యానికి మించిన మార్గం మరోటి లేదు. చెప్పినా చెప్పకపోయినా తాగేవాళ్లు ఎలాగూ తాగుతారు. అదేదో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకుని తాగితే కాస్త ప్రభుత్వానికి ఆదాయం.. అమెజాన్ కు ఆదాయం అని భావించినట్లుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆన్ లైన్ బుకింగ్ ద్వారా మద్యాన్ని సరఫరా చేయనుంది అమెజాన్ సంస్థ. ఈ మేరకు స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ అమెజాన్ కు అనుమతులు మంజూరు చేసింది.

రాష్ట్రంలో అమెజాన్ తో పాటు అలీబాబా వెంచర్ బిగ్ బాస్కెట్ కూడా మద్యం పంపిణీ చేయడానికి అనుమతి తీసుకుంది. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో నాల్గవది పశ్చిమ బెంగాల్. కాగా, అనేక సంవత్సరాలుగా భారతదేశంలో అమెజాన్ తన కార్యకలాపాలను విస్తరించింది. కిరాణా నుండి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతి వస్తువును ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. సంస్థ దేశంలో తన సేవలు విస్తరింపజేసేందుకు గాను 6.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. వైరస్ వ్యాప్తి నిరోధాన్ని కట్టడి చేసేందుకు ఇప్పటికే మద్యం పంపిణీ స్విగ్గి, జొమాటో ద్వారా జరుగుతోంది.

Similar News