దేశ సరిహద్దుల్లో చైనా సైన్యంతో ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు అస్తికలను ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు నిమజ్జనం చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా, మూసీ నదుల సంగమంలో జరిగిన ఈ కార్యక్రమంలో తండ్రి ఉపేందర్, భార్య సంతోషి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కల్నల్ సంతోష్ మరణం తమ కుటుంబానికి తీరని లోటైనప్పటికీ.. దేశం కోసం వీరమరణం పొందడం గర్వంగా ఉందన్నారు భార్య సంతోషి. అంతిమయాత్రలో సూర్యాపేట వాసులు చూపిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోనన్నారు కల్నల్ సతీమణి సంతోషి.