ఏపీలో మంత్రులకు సైతం తప్పని ఇసుక కష్టాలు

Update: 2020-06-20 12:42 GMT

ఏపీలో మంత్రులకు ఇసుక కష్టాలు తప్పడంలేదు.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌కు ఇసుక బుకింగ్‌లో చేదు అనుభవం ఎదురైంది. అమలాపురంలో తన సొంత ఇంటి నిర్మాణం కోసం ఆయన ఇటీవల ఆన్‌లైన్‌లో నాలుగు లారీల ఇసుక బుక్‌ చేశారు. రాజమండ్రి వద్ద ములకల్లంక గోదావరి ర్యాంప్‌ ఇసుక కోసం ఒక్కో లారీకి 17 వేల ఆన్‌లైన్‌లో మంత్రి చెల్లించారు. అయితే ఇసుక బదులు తువ్వ మట్టి రావడంతో ఆయన షాక్ అయ్యారు. ఇసుక బుక్ చేస్తే తువ్వ మట్టి వచ్చిందని... సైట్ ఇంచార్జి మంత్రికి చెప్పగా... మంత్రి విశ్వరూప్‌ జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు... ఆర్డీవో భవానీ శంకర్‌ విచారణ చేపట్టారు.

Similar News