దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి మరింతగా పెరుగుతోంది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో445 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా విజృంభించాక.. ఒక్క రోజులో సంభవించిన కరోనా మరణాల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13 వేల 699కి చేరింది. అటు దేశవ్యాప్తంగా కొత్తగా 14 వేల 821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 26 వేలు దాటింది. అయితే వీరిలో 2 లక్షల 37 వేల మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఒక లక్షా 75 వేల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజులో ఒక లక్షా 43 వేల 267 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు ఒక లక్షా 32 వేలు దాటగా.. 6 వేల 170 మంది ప్రాణాలు విడిచారు. ఢిల్లీలో పాజిటివ్ కేసులు దాదాపు 60 వేలకు చేరుకోగా.. 2 వేల 175 కన్నుమూశారు. అటు తమిళనాడులోనూ కరోనా పాజిటివ్ కేసులు దాదాపు 60 వేలకు చేరుకోగా.. 575 మంది మహమ్మారి బారినపడి చనిపోయారు. గుజరాత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 27 వేలు దాటాయి. యూపీ, రాజస్థాన్, వెస్ట్‌బెంగాల్, మధ్యప్రదేశ్, హర్యానాల్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.