ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు

Update: 2020-06-22 10:31 GMT

దేశ రాజధాని ఢిల్లీలో దాడులకు ఉగ్రవాదులు కుట్రపన్నారన్న నిఘావర్గాల హెచ్చరికలతో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడ్డారన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధానిలో దాడికి ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. బస్సు, కారు లేదా టాక్సీ ద్వారా ఉగ్రవాదులు దేశ రాజధానిలోకి ప్రవేశించవచ్చని ఇంటలిజెన్స్ హెచ్చరించాయి. దీంతో తనిఖీలు ముమ్మరం చేశారు. గెస్ట్ హౌస్‌లు, హోటళ్లు, బస్సు టెర్మినళ్లు, రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు చేపట్టారు. అణువణువూ గాలిస్తున్నారు. ఢిల్లీ బయట కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాల డీసీపీలు, స్పెషల్ సెల్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్లు హై అలర్ట్‌లో ఉన్నాయి.

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాట్లు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో నిత్యం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కుట్రలు మరింత ఎక్కువయ్యాయని నిఘా వర్గాల సమాచారం. దీంతో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో తనిఖీలను ముమ్మరం చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తం చేశారు.

Similar News