అనంతపురం వన్‌టౌన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి పోలీస్ కస్టడీ ముగియడంతో తిరిగి వారిని కడప సెంట్రల్ జైల్‌కి తరలించారు. తిరిగి కారాగారానికి తీసుకెళ్లేప్పుడు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. జిల్లా న్యాయాధికారి అనుమతితో రెండ్రోజులు ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను ప్రశ్నించారు పోలీసులు. BS-3 వాహనాల రిజస్ట్రేషన్ వివాదానికి సంబంధించిన ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.