రాజధాని అమరావతి తరలింపు ఇప్పట్లో ఉండబోదని మరోమారు స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. కరోనా సమస్య అధిగమించాకే రాజధాని తరలింపు ఉంటుందన్నారు. తిరుపతి నగరంలో పారిశుద్య కార్యక్రమాల కోసం 15 శానిటైజర్ మెషీన్లను త్వరలోనే తెప్పిస్తున్నామన్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వాటి పనితీరు పరిశీలించారు.