భారత్‌-చైనా సరిహద్దుకు వెళ్లే దారిలో కూలిన వంతెన

Update: 2020-06-23 11:43 GMT

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఓ వంతెన కూలిపోవడం కలకలం రేపింది. సరిహద్దుల్లో రక్షణ పనుల కోసం ఓ ప్రొక్లైనర్‌ను లారీపై తీసుకువెళ్తున్న సందర్భంలో అధిక బరువును తట్టుకోలేక ఈ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలోడ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లా లిలాం జోహార్ లోయలో ఈ ప్రమాదం జరిగింది. LACకి వెళ్లే దారిలోని ఈ బెయిలీ వంతెన కూలడంతో సైనికుల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో.. వంతెన పునర్‌నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ వంతెన కూలడం ముందుగా అనేక అనుమానాలకు తావిచ్చింది. ఐతే.. లారీ ఓవర్ లోడ్ వల్లే ఇది కూలినట్టు నిర్థారణ అయ్యింది.

Similar News