ఏపీలో పోలీసుల తీరుపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి : కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి

Update: 2020-06-22 22:29 GMT

దేశ భవిష్యత్తును నిర్ణయించే అంశాలపై ప్రజల ఆలోచన విధానం మారాలని పిలుపునిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. చైనా ఉత్పత్తులకు ఇండియా అంగడిగా మారిపోయిందన్నారు. ఇకనైనా ఆ పరిస్థితి మారాలన్నారు. ఇన్నాళ్లు దేశీయ మార్కెట్ ఉత్పత్తులను నిర్లక్ష్యం చేశామని..ఇక నుంచి ఆ ధోరణి మార్చుకోవాలన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్న కిషన్ రెడ్డి..కాంగ్రెస్ ప్రభుత్వంలో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను కూడా బీజేపీ హయాంలో పరిష్కారం అయ్యాయని అన్నారు. విజయవాడలో బీజేపీ రాయలసీమ జోన్‌ జన సంవాద్‌ వర్చువల్‌ ర్యాలీ పాల్గొన్న కేంద్రమంత్రి కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు.

ఏపీ ప్రభుత్వం కక్షధోరణిపై విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వంపై పోస్టులు పెట్టినా, ఇతర పార్టీలో చేరినా, నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమని గుర్తుంచుకోవాలన్నారు కిషన్ రెడ్డి. హోంమంత్రిగా నాకు ఏపీలో పోలీసుల తీరుపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల గొంతు నొక్కటం సరికాదన్నారు.

Similar News