చికెన్ మసాలా అనుకుని పురుగుల మందును కూరలో కలపడంతో.. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.. చిత్తూరు జిల్లా చెర్లపల్లి గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఎ.ఎల్ పురానికి చెందిన గోవిందమ్మ కుమార్తె ధనమ్మ పిల్లులు చెర్లపల్లి గ్రామానికి చెందిన అమ్మమ్మ ఇంటికి వచ్చారు. మనవళ్లు రావడంతో గోవింద చికెన్ వండాలనే ఆరాటంలో ఇంట్లో ఉన్న పురుగుల మందును చికెన్ మసాలా అనుకొని కూరలో కలిపి వండి పెట్టింది. అది తెలియని చిన్నారులు జీవ, రోహిత్.. చికెన్ తిని అస్వస్థతకు గురయ్యారు. వారితో పాటు గోవిందమ్మ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు వెంటనే ముగ్గుర్నీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారులు ఇద్దరూ మృతి చెందగా.. వృద్ధురాలు గోవిందమ్మ పరిస్థితి విషమంగా ఉంది.