స్కూల్ కి రమ్మంటూ ప్రభుత్వం ఆదేశాలు.. ఆందోళనలో ఉపాధ్యాయులు

Update: 2020-06-23 17:09 GMT

టీచర్లు, హెడ్మాస్టర్లందరూ పాఠశాలకు తప్పనిసరిగా హాజరవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. రోజూ బయోమెట్రిక్ విధానాన్ని అవలంభించాలి. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లకూడదు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు రక్షణ చర్యలు తీసుకుంటూ స్కూల్ కి రావాలి అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఉపాధ్యాయులు హడిలి పోతున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఇవేం ఉత్తర్వులు అని అంటున్నారు.

సోమవారం మద్యాహ్నమే హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసి ఆ వెను వెంటనే పాఠశాలలకు హాజరు కావాలని విద్యా కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రెడ్ జోన్ ఏరియాల్లో ఉన్న వారు, క్వారంటైన్ లో ఉన్న వారు, కిడ్నీ, కేన్సర్ గుండెజబ్బులతో బాధ పడేవారికి మినహాయింపు ఇచ్చారు. ఒకవైపు లాక్డౌన్ కొనసాగుతోంది. మరో వైపు ప్రజా రవాణా వ్యవస్థ పునరుద్దరించలేు. ఈ పరిస్థితిలో ఉన్నఫళంగా స్కూలుకు రమ్మంటే ఎలా వెళ్లాలని సీనియర్ ఉపాధ్యాయులు అంటున్నారు.

Similar News