నాపై టార్గెట్.. నేను దేనికైనా సిద్ధం : గంటా సవాల్

Update: 2020-06-23 16:06 GMT

వాట్సప్‌లో మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేశాడంటూ.. విశాఖలో అదుపులో తీసుకున్న నలందా కిషోర్‌ను అరెస్ట్‌ చేసి అనూహ్యంగా కర్నూలు తరలించారు. మొదట మంగళగిరికి తరలిస్తారని ప్రచారం చేశారు. కానీ చివరి నిమిషంలో.... కర్నూలుకు తరిలించారు. నలందా కిషోర్‌పై ఐపీసీ 505B, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఐడీ ప్రాంతీయ కార్యాలయం నుంచి నేరుగా కర్నూలు తరలించారు సీఐడీ అధికారులు. విశాఖ సీఐడీ ఆఫీసులో నలంద కిషోర్‌ను పరామర్శించేందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం నుంచి వేచి ఉన్నప్పటికి అధికారులు అనుమతించలేదు. కిషోర్‌ను విశాఖలోనే విచారించకుండా కర్నూలుకు ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు గంటా శ్రీనివాసరావు.

నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ ఫార్వార్డ్‌ చేశాడన్న నెపంతో తన సన్నిహితులను భయపెట్టి పెట్టి రాజకీయం చేయాలనుకోవడం సరికాదన్నారు. తనపై టార్గెట్ ఉంటే కక్ష తీర్చుకోవాలని, తాను దేనికైనా సిద్ధమని సవాల్‌ విసిరారు గంటా శ్రీనివాస్‌రావు. దేనినైనా రాజకీయంగా ఎదుర్కొంటామన్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే అలవాటు లేదన్నారు. మెసేజ్ రూపొందించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Similar News