తమిళ సూపర్ స్టార్ విజయ్ బర్త్ డే ఈరోజు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల పరంపర కొనసాగుతోంది. అందరికంటే విభిన్నంగా విష్ చేసింది మన మహానటి కీర్తి సురేష్.. ఆ అందాల బొమ్మ అందంగా వయోలిన్ వాయించి విజయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించింది. విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని కుట్టి స్టోరీ పాటను వయోలిన్ ద్వారా వాయించి వినిపించారు.
లాక్డౌన్ విరామ సమయం నా పాత కళను మెరుగులు పెట్టుకోవడానికి ఉపయోగించాను అని చెబుతూ.. 'జీవితం చాలా చిన్నది.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. పుట్టిన రోజు శుభాకాంక్షలు విజయ్ సర్. మీ బర్త్ డేకి నా ఈ చిన్న కానుకను స్వీకరించండి అని వయోలిన్ వినిపించారు. కీర్తి వయోలిన్ అద్భుతంగా వాయిస్తోందంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి నటే కాదు.. సంగీత కళాకారిణి కూడా నీలో దాగుందా అంటూ కీర్తిని కీర్తిస్తున్నారు. కేవలం గంట వ్యవధిలో దాదాపు 3 లక్షల మంది కీర్తి వీడియోని వీక్షించారు. కాగా కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ ఓటీటీలో రిలీజై ప్రేక్షకుల ప్రశంసలను దక్కించుకుంది.