నిమ్మగడ్డ, కామినేనితో భేటీకి సంబంధించి..... స్పష్టత నిచ్చారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ఈ నెల 13న తాను నిమ్మగడ్డ, కామినేనితో రహస్యంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోందన్నారు. దీనిపై వైసీపీ నేతలు దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. లాక్ డౌన్ తరువాత తన అధికార, వ్యాపార కార్యకలాపాలను బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడే వివిధ రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తనను కలుస్తున్నారు. అవి ఎంతమాత్రం కూడా రహస్య సమావేశాలు కాదన్నారు. తన కార్యకలాపాలను, సమావేశాలను రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం కూడా లేదన్నారు సుజనాచౌదరి.