ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన : భారత వాతావరణ శాఖ

Update: 2020-06-23 08:35 GMT

ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 24 నుంచి 26 మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర పంజాబ్ నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉందని తెలిపింది. ఇది జూన్ 24 నుంచి తూర్పు నుంచి ఉత్తరదిశగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో హిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని పలు ప్రాంతాలతో పాటు అసోం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలల్లో ఆరెంజ్‌ కెటగిరీ హెచ్చరిక జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది.

అలాగే ఉత్తర ఇంటీరియర్ ఒడిశా మీదుగా కూడా తుఫానులుంటాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్‌లోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News