మిజోరంలో మరోసారి భూప్రకంపనలు

Update: 2020-06-24 10:54 GMT

మిజోరంలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతతో ఈ రోజు ఉదయం 08:02 గంటలకు ఛాంపాయికి 31 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. మంగళవారం మిజోరాంలో 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత, ఈశాన్య రాష్ట్రంలో వరుసగా మూడు రోజుల్లో సంభవించిన మూడవ ప్రకంపనలు ఇవి.

ఆదివారం, సోమవారం రెండు సార్లు మిజోరంలో ప్రకంపనలు సంభవించాయి, అనేక ప్రదేశాలలో ఇళ్ళు , రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఆదివారం సాయంత్రం 4:16 గంటలకు సైతాల్ జిల్లాలో 5.1 తీవ్రతతో ప్రకంపనలు సంభవించగా, సోమవారం తెల్లవారుజామున 4.10 గంటలకు చంపై జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

Similar News