ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి చేస్తున్నది మరోటి..

Update: 2020-06-24 11:45 GMT

అధికారంలోకి వస్తే చేనేత రంగాన్ని ఆదుకుంటాం.. మగ్గం నేసే ప్రతి కార్మికుడికి సాయం చేస్తాం.. కులం, మతం చూడకుండా అందరికీ సమానంగా ఆర్థికసాయం అందిస్తాం. ఇది వైసీపీ అధినేత జగన్...‌ ఎన్నికలకు ముందు పాదయాత్రలో నేత కార్మికులకు ఇచ్చిన హామీ... కానీ ప్రస్తుతం మాత్రం దీనికి రివర్స్‌గా జరుగుతోంది. బడ్జెట్‌లో చేనేత రంగానికి నిధుల కేటాయింపు లేదు. పోనీ నేతన్న హస్తంతోనైనా అందరినీ ఆదుకున్నారా అంటే అదీలేదు. అధికార పార్టీ సూచించిన వారికే అగ్ర తాంబూలం. ఇలా వేలాది మంది కార్మికులు అన్ని అర్హతలు ఉండి.. అనర్హులుగా మిగిలిపోయారు.

Similar News