మహారాష్ట్రలో కొత్తగా 3,214 మందికి కరోనా

Update: 2020-06-24 12:19 GMT

మహారాష్ట్రలో కరోనావైరస్ కరాళనృత్యం చేస్తోంది. గత 24 గంటల్లో 3,214 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. అలాగే కొత్తగా 248 మంది మరణించారు. ఐఎన్ఎస్ శివాజీకి చెందిన 8 మంది నావికులు కరోనా భారిన పడ్డారు. కొత్త కేసులలో ముంబైలో 824, థానేలో 1,116 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వ్యాధి సోకిన వారి సంఖ్య 1 లక్ష 39 వేల 010 కు చేరుకుంది, అందులో 62 వేల 883 క్రియాశీల కేసులు ఉండగా.. కరోనా నుండి ఇప్పటివరకు 6,531 మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News