మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో మంగళవారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. మహారాష్ట్రలోని అకోలాకు దక్షిణాన 129 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించాయని ఎన్‌సిఎస్ వెల్లడించింది. ఆస్తినష్టం, ప్రాణనష్టం గాని జరిగినట్టు నివేదికలు లేవు.
కాగా గత కొన్ని నెలల నుండి భారతదేశం తక్కువ తీవ్రతతో భూకంప ప్రకంపనలను ఎదుర్కొంటోంది. మిజోరాం, గుజరాత్ , ఢిల్లీలో లలో కూడా ప్రకంపనలు వచ్చాయి. సోమవారం మధ్యాహ్నం కూడా ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో రిక్టర్ స్కేల్‌లో 3.6 తీవ్రతతో కూడిన ప్రకంపనలు సంభవించాయి. రాయగడ జిల్లాలోని కాసిపూర్ ప్రాంతంలో మంగళవారం 16:40 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.