పేదలకు ఇంటి స్థలాల విషయంలో ఎమ్మిగనూరులో ఉద్రిక్తత

Update: 2020-06-23 18:48 GMT

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివన్ననగర్‌లోని సర్వే నెంబర్‌ 64, 65లో టీడీపీ హయంలో పేదలికిచ్చిన ఇంటి స్థలాల్లో కట్టడాల్ని కూల్చి వేసేందుకు వచ్చారు రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు. దీనిపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతోంది. అయితే..ఇందుకోసం ఈ సర్వే నెంబర్లనే ఎంపిక చేయడం .. వివాదస్పదంగా మారింది. తమకు గత టీడీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించిందని, ఇప్పుడు మళ్లీ.. ఈ స్థలాలనే.. వేరొకరికి ఎలా కేటాస్తారంటూ మండిపడుతున్నారు లబ్దిధారులు. పెద్ద ఎత్తున బాధితులు ఆందోళనకు దిగిన లబ్ధిదారులు .. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారుల్ని అడ్డుకున్నారు. దీంతో వీరిని అరెస్ట్‌ చేసేందుకు భారీగా పోలీసులు చేరుకున్నారు.

Similar News