విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ సన్నిధి ఇంద్రకీలాద్రిలో విధులు నిర్వహించే అర్చకునికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో ఆలయ ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా బాధిత అర్చకుడు లక్ష కుంకుమార్చనలో విధులు నిర్వహిస్తున్నారు. అర్చకుడికి పాజిటివ్ రావడంతో ఆలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. విజయవాడలోని పిన్నమనేని ఆస్పత్రిలో అర్చకునికి వైద్యులు చికిత్స చేస్తున్నారు.