ఢిల్లీలో ఒక్కరోజే కరోనా మహమ్మారికి 64మంది బలి

Update: 2020-06-24 23:00 GMT

ఢిల్లీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. గడిచిన 24గంట్లో ఢిల్లీలో 3,788 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 70,390కి చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. అటు, ఢిల్లీలో కరోనా మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్క రోజులోనే 64 మంది మరణించారు. అయితే, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 41,437 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 26,588 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. అటు, 2365 మంది కరోనా వల్ల మరణించారు.

Similar News