బెజవాడలో నకిలీ పోలీసుల ఆటకట్టించారు ఒరిజినల్ పోలీసులు. వాహనాల తనిఖీల్లో భాగంగా సైబరాబాద్‌లో SIగా నకిలీ ఐడీ కార్డుతో చెలామణి అవుతున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. భవానీపురం పోలీసులు ఈ కేసులో మరింతగా విచారణ జరుపుతున్నారు. నకిలీ ఐడీ కార్డులతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు వెస్ట్ ఏసీపీ సుధాకర్.