నెల్లూరులో భారీ మద్యం డంప్‌ స్వాధీనం

Update: 2020-06-25 09:35 GMT

నెల్లూరు నగరంలో భారీ మద్యం డంప్‌ స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు... కుక్కలగుంటలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని గుర్తించారు. దీని విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు... ఓ ఇన్నోవా వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మెయిన్‌ బ్రాండ్ల మద్యాన్ని నిలువ చేసి అధిక ధరలకి అమ్మకాలు సాగిస్తున్న బడా ముఠాగా అధికారులు తెలిపారు.

Similar News