కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని సహకార బ్యాంకులను R.B.I పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో 1, 482 కో ఆపరేటివ్ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకులు R.B.I పరిధి లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు పాస్ పోర్ట్ జారీ ప్రక్రియను కేంద్రం సులభతరం చేసింది. పాస్ పోర్ట్ కోసం ఇవ్వాల్సిన ధ్రువీకరణ పత్రాల జాబితాను కుదించింది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చి దిద్దాలని కేంద్రం నిర్ణయించింది. అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఇచ్చిన కేంద్రం, ఓబీసీ కులాల వర్గీకరణ కమిటీ గడువును మరో 6 నెలలు పొడిగించింది.