అసలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏదనే దానిపై మళ్లీ ఇప్పుడు చర్చ మొదలైంది.. వైఎస్సార్ కాంగ్రెస్ ఉనికినే ప్రశ్నిస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంధించిన ప్రశ్నలతో కొత్త చర్చ మొదలైంది. నిజమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమదేనని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా స్పష్టం చేశారు. ప్రస్తుత అధికార పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటూ వివరణ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నిజమైన వైఎస్సార్ అభిమానుల పార్టీ తనదేనన్నారు. వైఎస్సార్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పార్టీ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన అన్నారు.