మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఏపీ డీజీపీ వీడియో సందేశం
మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. మత్తు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతని కోరారు. భవిష్యత్ వైపు ఉన్నత ఆశయాల దిశగా యువత అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిరోధంలో పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు డిజీపీ గౌతం సవాంగ్.