వాస్తవాధీన రేఖ వెంట చైనా దురాక్రమణకు దిగిన నేపథ్యంలో.. ఇదే అంశంపై చర్చించేందుకు వర్చువల్ పార్లెమంట్ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతోపాటు దేశంలో మరిన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిపై చర్చ జరగాలని అన్నారు. 1962లో చైనాతో యుద్ధం తరువాత కూడా అటల్ బిహారీ వాజ్‌పేయి పార్లమెంటును సమావేశపరిచి.. యుద్దం గురించి చర్చించాలని డిమాండ్ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అన్నారు. బీజేపీ డిమాండ్ ను అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ కూడా అంగీకరించి సమావేశాలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కీలక సమయంలో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు.