హైదరాబాదుకు చెందిన ప్రసిద్ధ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో సంస్థ రూపొందించిన రెమ్డిసివియర్ ఔషధాన్ని ముందుగా అయిదు రాష్ట్రాలకు పంపించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ముంబై, ఢిల్లీ వంటి నగరాలతో పాటు తమిళనాడు, గుజరాత్, హైదరాబాద్ నగరాలకు 20 వేల ఇంజక్షన్లను పంపించినట్లు హెటిరో తెలిపింది. రెండో విడతలో కోల్ కతా, ఇండోర్, భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చి, త్రివేండ్రం, పణాజి నగరాలకు పంపించనున్నట్లు తెలిపింది. కోవిఫర్ (రెమ్డిసివిర్) 100 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. పాజిటివ్ రోగులుగా గుర్తించబడిన చిన్నారులు, యువత కోసం వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికే ఈ ఔషధం ఇవ్వబడుతుంది. కాగా, భారత్ లో గురువారం నాటికి 4.73 లక్షల కరోనా కేసులు నమోదుకాగా 14,894 మంది మరణించారు.