ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరచిపోదని ప్రధాని మోదీ అన్నారు. 1975 జూన్ 25న మాజీ ప్రధాని ఇందిర ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి నేటికి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. నాటి ఉద్యమకారులకు మోదీ నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఎందరో పోరాడి హింసను ఎదర్కొన్నారని.. వారందరికీ తాను సెల్యూట్ చేస్తున్నా అంటూ ట్విట్టర్‌లో తెలిపారు. దాంతోపాటు.. ఎమర్జెన్సీ సందర్భంగా గత ఏడాది మన్ కీ బాత్‌లో మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
आज से ठीक 45 वर्ष पहले देश पर आपातकाल थोपा गया था। उस समय भारत के लोकतंत्र की रक्षा के लिए जिन लोगों ने संघर्ष किया, यातनाएं झेलीं, उन सबको मेरा शत-शत नमन! उनका त्याग और बलिदान देश कभी नहीं भूल पाएगा। pic.twitter.com/jlQVJQVrsX
— Narendra Modi (@narendramodi) June 25, 2020