ఢిల్లీలో కొత్తగా 3460 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Update: 2020-06-27 08:23 GMT

ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 3460 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 77240కి చేరింది. కరోనా కారణంగా ఒక్కరోజే 63 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 2492 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కరోనా బారిన పడి ఆ రాష్ట్ర మంత్రి సత్యేంద్ర జైన్ కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Similar News