కరోనా మహమ్మారి రాజకీయ నాయకుల్లో గుబులు పుట్టిస్తుంది. తాజాగా కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మనూ సింఘ్వీకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన కార్యలయంలో పని చేసే సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తే.. అందరికీ నెగెటివ్ వచ్చింది. అయితే, అభిషేక్ కు కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆయన జూలై 9 వరకూ హోం ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు తెలిపారు.