మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

Update: 2020-06-27 14:01 GMT

తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. చెంగల్పేట్ జిల్లా చెయ్యూర్‌ నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే ఆర్‌ టీ అరసు కరోనా మహమ్మారి బారినపడ్డారు. కరోనా పరీక్ష కోసం శాంపిల్స్‌ ఇచ్చిన అరసు.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శనివారం ఉదయం తేలింది. దీంతో ఆయన చికిత్స కోసం చెన్నైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు.

ఇప్పటికే డీఎంకేలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ కరోనా మహమ్మారి వల్ల డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ మృతిచెందారు. మరో ఎమ్మెల్యే కే.కార్తికేయన్‌కు కరోనా సోకింది. ఇప్పడు ఎమ్మెల్యే అరసే కూడా కరోనా పాటిజివ్‌ గా రిపోర్ట్ రావటంతో.. కార్యకర్తలు ఆందోళనలు చెందుతున్నారు. కాగ, తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 3,645 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Similar News