ప్లాస్మా థెరపీతో మరణాలు రేటు బాగా తగ్గింది: కేజ్రీవాల్

Update: 2020-06-26 18:41 GMT

ప్లాస్మా థెరపీతో కరోనా మరణాల రేటు బాగా తగ్గించామని ఢిల్లీ సీఎం అరవించద్ కేజ్రీవాల్ అన్నారు. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని.. అయితే, బాధితులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించడం, పల్స్ ఆక్సీమీటర్లు ఇవ్వడం ద్వారా కరోనా మరణాలు సగానికి తగ్గించామని అన్నారు. అయితే, తక్కువ లక్షణాలు ఉన్నపుడు మాత్రమే ప్లాస్మా థెరపీ బాగా పని చేస్తుందని అన్నారు. కరోనా తీవ్రత ఎక్కవగా ఉంటే ఈ చికిత్స ఎంతవరకు ప్రయోజనం చేకూర్చుతుందో అర్థంకాదని అన్నారు. కరోనా కేసులు అధికంగా పెరిగినా.. పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. కరోనా పరీక్షల సామర్థ్యం మూడు రెట్లు పెంచామని కేజ్రీవాల్ అన్నారు.

Similar News