కరోనా కారణంగా పుదుచ్చేరి సీఎం కార్యాలయం మూతపడింది. ముఖ్యమంత్రి కార్యలయంలోని సిబ్బందికి కరోనా సోకడంతో మూసివేశారు. శనివారం ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో కార్యాలయాన్ని క్రిమిసంహారక మందులతో పిచకారి చేసి.. తరువాత సీల్ చేశారు. ఇంకా అసెంబ్లీ కాంప్లెక్స్ కూడా శానిటైజేషన్ చేశారు. కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్స్ అయిన వారిని క్వారంటైన్ కు తరలించారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. సీఎం ఆఫీస్ లోనే కరోనా సోకడం ఆందోళనకరంగా మారింది.