మధ్యప్రదేశ్ లో విశ్వహిందూ పరిషత్ (vhp) సభ్యుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. హోసంగాబాద్ జిల్లాకు చెందిన రవి విశ్వకర్మ (35) వీహెచ్‌పీ గోరక్షక్ శాఖ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో విశ్వకర్మ తన ఇద్దరు సహచరులతో కలిసి కారులో హోసంగాబాద్ నుంచి పిపారియాకు వెళుతున్నారు.
ఈ క్రమంలో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు వారిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం కాల్పులు జరిపి పారిపోయారు. ఛాతీమీద రెండు బుల్లెట్లు తగలడంతో విశ్వకర్మ అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పిపారియా పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.