కరోనాతో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ మృతి

Update: 2020-06-28 19:51 GMT

కరోనాతో చేస్తున్న యుద్దంలో ముందుండి పోరాటం చేస్తున్న డాక్టర్లు, పోలీసులు ఎక్కవ సంఖ్యలో కరోనా మహమ్మారికి బారిన పడుతున్నారు. పలువురు కరోనాతో మృతి చెందుతున్నారు కూడా. తాజాగా బెంగళూరులో అసిస్టెంట్ సబ్ ఇన్పెక్టర్ ను ఈ మహమ్మారి బలి తీసుకుంది. తన ఇంట్లోనే బాత్రూంలో మృతి చెందారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. 55 ఏళ్లు పైబడిన వారు ఇంటి దగ్గరే ఉండాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన జూన్ 10 నుంచి ఇంట్లోనే ఉంటున్నారు.

Similar News