మహారాష్ట్రలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. దేశంలో ఎక్కవ కేసులతో అన్ని వర్గాల ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అయినా.. కేసులు మాత్రం ఏమాత్రం తగ్గటంలేదు. మహారాష్ట్రలో అకోలా జైలులో 50మంది ఖైదీలు కరోనా భారిన పడినట్టు జైలు అధికారులు తెలిపారు. ఈ జిల్లా జైలులో మొత్తం మూడు వందల మంది ఉండగా.. వారందరికీ కరోనా టెస్టులు చేయగా 50 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని జైలు అధికారులు తెలిపారు.