దేశ రాజధాని ఢిల్లీలో కరోనా స్వైరవిహరం చేస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ఢిల్లీ కరోనాకు గ్లోబల్ హాట్ స్పాట్ గా మారుతుంది. ప్రతీ రోజకు కొత్తగా వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 2889 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 83,077కి చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి 52,607మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 27,847మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మహమ్మారికి ఇప్పటి వరకూ 2,623మంది ప్రాణాలు కోల్పోయారు.