గాల్వాన్ లోయలో ఘటనకు అదే కారణం: కేంద్రమంత్రి

Update: 2020-06-29 21:17 GMT

గాల్వాన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణకు కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ కొత్త కారణాలను తెరపైకి తీసుకొని వచ్చారు. చైనా వేసుకున్న టెంట్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో ఇరు పక్షాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని వీకే సింగ్ అన్నారు. ఎల్ఏసీ దగ్గర ఇరు దేశాల సైనికులు ఉండకూడదని చర్చలు జరిపాయని.. రెండు దేశాలు కూడా దీనికి అంగీకరించాయని అన్నారు. అందులో భాగంగా ఎల్ఏసీ దగ్గర పరిస్తితిని చూడటానికి భారత సైనికులు వెళ్లారని.. అయితే, అప్పటికీ అక్కడ చైనా సైనికులు టెంట్లు తొలగించలేదని అన్నారు. దీంతో భారత సైనికులు టెంట్లు తొలగించమని ఆదేశించారని.. అదే సమయంలో ఆ టెంట్లలో మంటలు చెలరేగటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని కేంద్రమంత్రి తెలిపారు.

Similar News