ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన చంద్రబాబు

Update: 2020-06-30 13:48 GMT

విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. అర్థరాత్రి దాటక రియాక్టర్ నుంచి విష వాయువులు లీక్ కావడంతో.. కంపెనీలో షిఫ్ట్ ఇన్ చార్జ్, కెమిస్ట్ మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి.

గ్యాస్ లీకేజీపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరవాడలో రియాక్టర్ నుంచి బెంజీన్ లీకేజీపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ లీకేజి మరువక ముందే పరవాడ గ్యాస్ లీకేజి దుర్ఘటన బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు చంద్రబాబు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. గ్యాస్ లీకేజీ బాధితులకు వెంటనే అత్యున్నత వైద్యసాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Similar News