దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే కొత్తగా 2,084 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85 వేల మార్కును దాటింది. కరోనా మహమ్మారి బారి నుండి ఇప్పటి వరకు 56,235 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 26,246 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా మహమ్మారి బారిన పడి సోమవారం కొత్తగా 57 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,680కి చేరింది.