రాష్ట్ర ప్రజలకు వచ్చే ఏడాది జూన్ వరకు ఉచితంగా..: సీఎం

Update: 2020-07-01 12:37 GMT

దేశంలోని 80 కోట్ల మంది పేదలకు నవంబర్ వరకు ఉచితంగా రేషన్ అందిస్తామని అన్ లాక్ 2.0 సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందుకు రూ.90వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే ప్రధాని ఉచిత రేషన్ పథకాన్ని ప్రకటించిన కొద్ది నిమిషాలకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. తమ ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్ వరకు ఉచిత రేషన్ అందిస్తుందని దీదీ స్పష్టం చేశారు. రేషన్ బియ్యం నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని కేంద్రం ఇచ్చే వాటి కంటే మంచివి ఇస్తామని దీదీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చే రేషన్ రాష్ట్రంలోని 60 శాతం మందికి మాత్రమే అందుతుందని ఆమె అన్నారు. ఇక కేంద్రం నిషేధం విధించిన చైనా యాప్ ల గురించి మాట్లాడుతూ.. యాప్ లు నిషేధం విధిస్తే ఫలితం రాదు. చైనాకు దిమ్మతిరిగే సమాధానం ఇవ్వాలని మమత అన్నారు.

Similar News