దేశంలో కరోనా మమహ్మరి స్వైర విహారం చేస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఇక మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. అయితే కరోనా మహమ్మారి బారిన పడిన 103ఏళ్ల వృద్ధుడు.. కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్న సంఘటన థానేలో చోటుచేసుకుంది.
థానేకు చెందిన ఓ వృద్ధుడు నెలరోజుల క్రితం కరోనాతో ఆస్పత్రిలో చేరాడు. అయితే చికిత్స అనంతరం అతను పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగ అతని సోదరుడు కూడా కరోనాతో ఆస్పత్రిలో చేరాడు. 85 ఏళ్ల సదరు సోదరుడు కూడా కోలుకుంటున్నాడని, ఆయన్ను కూడా త్వరలోనే డిశ్చార్జి చేస్తామని థానే ఆస్పత్రికి వైద్యులు తెలిపారు.