మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా ఆనందీబెన్ పటేల్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ కుమార్ మిట్టా ఆమెతో ప్రమాణం చేయించారు.
మధ్యప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ లాల్జీ టాండన్ శస్త్రచికిత్స కోసం లక్నో వెళ్లారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్ పటేల్‌కు మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను కేంద్రం అప్పగించింది.