తెలంగాణలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఇకహైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రెండు, మూడు రోజుల్లో లాక్ డౌన్ విధిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణలో ఉంటున్న ఏపీ వాసులు ఆంధ్రాకు ప్రయాణమవుతున్నారు. దీంతో ఏపీ బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర భారీగా రద్దీ నెలకొంది. పొందుగల చెక్ పొస్టు, గరికపాడు చెక్ పోస్టుల వద్దకు పెద్ద ఎత్తున ఏపీ ప్రజలు తరలి వస్తున్నారు.
అయితే స్పందన పాసులు ఉన్నవారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు. దీంతో పాసులులేని వారు నిరాశగా వెనక్కి వెళ్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే పాసులు ఉన్నవారిని ఏపీలోకి అనుమతిస్తామని డీజీపీ సూచించారు. రాత్రి 7 గంటల తర్వాత అత్యవసరమైతేనే అనుమతిస్తామని తెలిపారు.