పతంజలి సంస్థకు స్వల్ప ఊరట లభించింది. పతంజలి సంస్థ తయారు చేసిన కరోనిల్, శ్వాసరి ఔషధాల అమ్మకాలకు కేంద్రం అనుమతినిచ్చింది. కరోనాను నయం చేసే ఔషధాలుగా కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచే మందులుగా విక్రయించాలని ఆయుష్ మంత్రిత్వశాఖ ఆదేశించింది. కరోనా రోగుల్లో రోగనిరోధక శక్తిని పెంచే మందుగా మాత్రమే ప్రచారం చేసుకోవాలని పతంజలి సంస్థకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తమ ఔషధాల అమ్మకాలపై ఆయుష్ శాఖ ఎలాంటి ఆంక్షలు విధించలేదని పతంజలి సంస్థ కూడా బుధవారం స్పష్టం చేసింది. ‘కరోనిల్ తదితర ఔషధాల విక్రయాలకు అన్ని అనుమతులు ఉన్నాయి. ఈ రోజు నుంచి ఔషధాల కిట్లు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి’అని రాందేవ్ బాబా తెలిపారు.