ఢిల్లీలో కరోనాతో ఒక్కరోజే 61 మంది మృతి

Update: 2020-07-01 23:52 GMT

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఒక్కరోజే 2442 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89,802కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 27007 ఉన్నాయి. కరోనా మహమ్మారి బారి నుండి కోలుకుని 59,992 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో కరోనా బారిన పడిన వారి ఒక్కరోజే 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. ఢిల్లీలో కరోనా మరణాల సంఖ్య 2803కు చేరింది.

Similar News